Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

గోదావరి నదిలో రబ్బర్‌డ్యామ్..

టూరిజం స్పాట్‌గా సోన్ గోదావరి పాత వంతెన
 సాహస జలక్రీడల కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు
కార్యాచరణ వైపు టూరిజం కారిడార్

Godavari-Riverమన తెలంగాణ / నిర్మల్ :  నిర్మల్ మండలంలోని సోన్ గోదావరి నది మధ్య లో రబ్బర్‌డ్యామ్‌ను నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈమేరకు బాసర నుంచి జైనథ్‌వరకు మధ్యలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు, పొచ్చెర, కుంటాల జలపాతం, అలాగే కవ్వాల్ అభయారణ్యం లను కలుపుకొని టూరిజం కారిడార్ నిర్మించాలని పర్యాటక శాఖ గత కొద్దిరోజుల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మల్ పట్టణంలోని చారిత్రక కోటలు, బురుజులను సైతం ఈ కారిడార్ పరిధిలోకి చేర్చాలని తలపెట్టారు. ఇప్పటికే దీనికి సం బంధించి పూర్తి ప్రణాళికలు రూపొందుతున్నట్లు సం బంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండ గా ఇటీవల పర్యాటక శాఖ మరో అడుగు ముందుకేసి సోన్ వద్ద గల గోదావరి నదిపై ప్రస్తుతం నిరుపయో గంగా ఉన్న బ్రిడ్జిని సద్వినియోగం చేసుకోవాలని తల పెట్టింది. ఈ పాత బ్రిడ్జి ఇప్పటికీ అత్యంత బలంగా ఉన్న విషయాన్ని పర్యాటశాఖ అధికారులు ఇంజ నీరింగ్‌శాఖ అధికారులతో నిర్ధారించుకున్నారు. ఈ వంతెన మరో 50ఏళ్లవరకు కూడా చెక్కుచెదరబోదని అధికారులు తేల్చారు. దీంతో ఈ వంతెనను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని పర్యాటకశాఖ యోచిస్తోంది. దాదాపు కిలోమీటరు పొడవుతో ఉన్న ఈ బ్రిడ్జిపై పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాల ని యోచిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యాటకశాఖ అధి కారులు సోన్ గోదావరి బ్రిడ్జిని స్వయంగా పరిశీలిం చారు. దాదాపు రెండుగంటలకుపైగా ఇక్కడ పర్యా టక ఏర్పాట్లకు సంబంధించిన అనుకూల అంశాలపై పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండడంతో గోదావరి వంతెన ఇక రాబోయే రోజుల్లో ప్రత్యేక టూరిస్టుస్పాట్‌గా మారబోతోంది. బంగీజంప్ లాంటి సాహస జలక్రీడలకు ఈ బ్రిడ్జిని వేదికగా చేసు కోవాలని పర్యాటకశాఖ భావిస్తోంది. దీంతో పాటు మరికొన్ని సాహస క్రీడలను సైతం ఇక్కడ నిర్వహించే సాధ్యసాధ్యాలను అధికారులు పరిశీలించారు. హైద రాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు వెళ్లే జాతీయ రహ దారి మధ్యలో సోన్ గోదావరి వంతెన ఉండడమే గాకుండా నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులోనూ, కరీంనగర్ జిల్లాలకు అత్యంత సమీపంలోనూ ఉండ డంతో పర్యాటకులను ఈ వైపు ఎక్కువగా ఆకర్షించే అవకాశాలు ఉంటాయని పర్యాటకశాఖ యోచి స్తోంది. మొత్తానికి టూరిస్టు కారిడార్ ఏర్పాటులో కది లిక మొదలవుతుండడం ఈ ప్రాంతానికి కలిసివచ్చే అంశంగా పేర్కొంటున్నారు.

Comments

comments