Home తాజా వార్తలు బీదర్‌లో పుకారు హత్య

బీదర్‌లో పుకారు హత్య

dead

 హైదరాబాద్‌ వాసులపై మూకదాడి, ఒకరు దుర్మరణం

మన తెలంగాణ/ హైదరాబాద్‌సిటీబ్యూరో/ ఎల్‌బినగర్ : సామాజిక మాధ్యమాలలో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలు ఒక  తండా వాసుల్లో అనుమానాలను రేకెత్తించాయి. ఆగ్రహాన్ని రగిల్చాయి. అనుమానితులుగా భావించిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి విచక్షణా రహితంగా చితకబాదేలా చేశాయి. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలకు గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ముర్కి గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధిత బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ అజం, సలామ్ (ఖాతర్ దేశస్థుడు), సల్మాన్, నూర్ మహ్మద్‌లు కలిసి బీదర్ జిల్లాలోని హందికేర గ్రామానికి చెందిన బషీర్‌సాబ్ ఇంటికి భోజనానికి వచ్చారు. కాగా ఆ మార్గంలోనే ఉన్న బోతకుల తండా వద్ద రోడ్డుపైన ఉన్న ముగ్గురు బాలికలకు వీరు చాక్లెట్లను అందించారు. ఒకతను వీరిని అపార్థం చేసుకున్నాడు. వీరు దొంగలుగా భావించి సమాచారాన్ని సామాజిక మాధ్యమాలల్లో ప్రచారం చేశాడు.స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండటాన్ని గ్రహించిన వీరు కారులో అక్కడి నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో ముర్కి గ్రామం వద్ద ఒక ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. ఆ దీంతో అక్కడ ఆగిన కారును రెండు గంటలపాటు వేల మంది చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మహ్మద్ అజం అనే వ్య్యక్తి మృతిచెందాడు. నూర్ మహ్మద్, సల్మాన్‌లు తీవ్రగాయాలకు గురయ్యారు. ఒక పోలీసు కానిస్టేబుల్ రజనీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది తెలిసిన వెంటనే బీదర్ ఎస్‌పి దేవరాజ్ ప్రత్యేక పోలీసు వెంటనే చర్యలు తీసుకున్నారు. బాధితులను నగరానికి తరలించారు. వీరు చికిత్స నిమిత్తం మలక్‌పేట్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన వ్యక్తిని బీదర్ పోలీసులు అరెస్టు చేశారు.బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యేనగరానికి చెందిన వ్యక్తులపై బీదర్‌లో దాడి జరిగిందని తెలుసుకున్న మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బల్లాల వారు చికిత్సపొందుతున్న యశోద ఆసుపత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవి తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.