Search
Friday 21 September 2018
  • :
  • :

గోవా సిఎం ఆరోగ్యంపై పుకార్లు

Manohar

ముంబయి : గోవా సిఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం విషమించినట్లు వస్తున్న పుకార్లను లీలావతి ఆస్పత్రి యాజమాన్యం కొట్టి పారేసింది. పారికర్ ఆరోగ్యంతోనే ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్‌తో నాలుగు రోజుల క్రితం మనోహర్ పారికర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పారికర్‌ను ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించారు. పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పారికర్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచురించొద్దని వారు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌మీడియాను కోరారు.

Rumors on Goa CM health

Comments

comments