Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

షారుక్‌ఖాన్‌పై పుకార్లు

shahrukh-khan

ముంబయి : బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్ చనిపోయాడంటూ పుకార్లు వచ్చాయి. యూరప్‌కి చెందిన ఓ న్యూస్ ఛానల్ ఈ పుకార్లను ప్రచారం చేసింది. షారుక్ ఫొటోను చూపిస్తూ ఈ విధంగా వార్తను ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. బిజినెస్ పనిమీద పారిస్ వస్తున్న ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడని ప్రసారం చేసింది. ఈ పుకార్లు వైరల్‌గా మారడంతో భారత్ ఉలిక్కిపడింది. ఈ పుకార్ల నేపథ్యంలో షారుక్, అతని అభిమానులు, బంధువుల నుంచి పోలీసులకు తెగ ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. అయితే ఈ పుకార్లు అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దంటూ షారుక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

comments