Home రాష్ట్ర వార్తలు ఉప్పుకార్లు

ఉప్పుకార్లు

Saltకొరత వదంతులతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల కిలో రూ. 300 నుంచి 400 అమ్మి సొమ్ము చేసుకున్న వ్యాపారులు, 40 మంది అరెస్టు 

మన తెలంగాణ/ హైదరాబాద్: గత మూడు రోజులుగా నోట్ల మార్పిడి కోసం తంటాలు పడుతున్న సామాన్య జనానికి కొత్తగా ఉప్పు తిప్పలు వచ్చిపడ్డాయి. మార్కెట్లో ఉప్పు దోరకడం లేదన్న ప్రచారం జరగడంతో వ్యాపారులు అమాయక జనాన్ని నిలువునా దోచుకున్నారు. ఈ అసత్య వార్త దావానలంలా వ్యాపించడంతో సగటు జీవి విధిలేక ఉప్పు కోసం పరుగులు పెట్టారు. రాజ ధాని హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతా ల్లోగల దుకాణాల్లో ఉప్పు ధర నిప్పయి మండిం ది. కిలో ఉప్పు రూ. 300 నుంచి 400 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులకు తెలి యడంతో రంగంలోకి దిగిన నగర, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు 40 మంది వ్యాపారులను అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. ఈ అసత్య వార్త ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరం గల్, రంగారెడ్డి తదితర జిల్లాలకు కూడా పాకడంతో ఆయా జిల్లాల్లో కూడా ఉప్పు రేట్లను వ్యాపారులు పెంచారు.
వదంతి మాత్రమే – మంత్రి ఈటెల రాజేందర్
ఉప్పుకు రెక్కలోచ్చాయని జరుగుతున్న ప్రచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.ఉప్పు ధరలు పెరిగాయన్నది కేవలం వదంతి మాత్రమేనని ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, ఉప్పుధరలు పెరగలేదని,భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్ధిక,పౌరవసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.