Home తాజా వార్తలు భారీగా పతనమైన రూపాయి…!

భారీగా పతనమైన రూపాయి…!

Rupee at 19 month low after down 30 Paise

ముంబయి: డాలర్‌తో రూపాయి విలువ బుధవారం భారీగా పతనమైంది. ఏకంగా 19 నెలల కనిష్టానికి పడిపోయింది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావంతో ద్రవ్యోల్భణం, ఆర్థిక లోటు పెరుగుతుందని ట్రేడర్స్ ఆందోళన వ్యక్త చేస్తున్నారు. బుధవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.42పైసలతో ప్రారంభమై రూ. 68.50కి పడిపోయింది. ఇది 19 నెలల క్రితం (2016, డిసెంబర్)నాటి విలువతో సమానం. కాగా, రెండు రోజుల క్రితం ఆర్‌బిఐ.. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68.1466గాను, యూరోతో 79.3499 గాను నిర్ణయించింది. జూన్ 22న ఈ మారకం రేట్లు 67.76, 78.85గా ఉన్నాయి.