Home తాజా వార్తలు భారీగా పతనమైన రూపాయి

భారీగా పతనమైన రూపాయి

Rupee may weaken to Rs 70/$ in 2018

ముంబయి: రూపాయి మళ్లీ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలవు రూ.71కి చేరింది. డాలర్ డిమాండ్ పెరగడంతో రోజు రోజుకీ రూపాయి విలువ పడిపోతూ వస్తోంది. ఆగష్టు 30 తారీఖున రూ. 70.52 తాకిన విషయం తెలిసిందే.  వాణిజ్య వివాద పరిష్కారాల దిశలో మెక్సికో, కెనడాలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోందని, బ్యాంకు ఆయిల్ రిఫైనర్స్ నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.  వాణిజ్య లోటు కూడా పెరగడం రూపాయిపై ప్రభావం చూపిందన్నారు.