Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రూపాయిపై ఆందోళన అవసరంలేదు

స్థూల ఆర్థిక గణాంకాల బలోపేతంపై దృష్టి పెట్టాలి
హానికర సమ్మేళనంతో ప్రపంచ వృద్ధిపై ప్రభావం
ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

Raghuram Rajan advice sought on tackling NPA problem

న్యూఢిల్లీ : రూపాయి పతనం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రస్తుతం స్థూల ఆర్థిక గణాంకాల పటిష్టంపై దృష్టి పెట్టాలని, రూపాయి గురించి ఆందోళన అవసరం లేదని అన్నారు. కరెంట్ ఖాతా లోటును తగ్గించి, ఆర్థిక స్థిరీకరణపై భారత్ దృష్టి పెడుతుందని తాను భావిస్తున్నానని రాజన్ అన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్థూల ఆర్థిక స్థిరీకరణపై భారత్ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది’ అని రాజన్ మీడియా వ్యాఖ్యానించారు.

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రూపాయి 9 శాతం పతనమైంది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, టర్కీ కరెన్సీ లిరా భారీగా క్షీణించడం వంటి అంశాల ప్రభావంతో వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. ఇది మరీ అంతగా ఆందోళన చెందాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘నేను రూపాయి ఆందోళనకర స్థాయికి చేరుకుందని భావించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా డాలర్ మరింత బలపడింది’ అని రాజన్ బ్లూమ్‌బర్గ్ టెలివిజన్ ఇంటర్వూలో అన్నారు.

విదేశీ కరెన్సీ నాన్ రెసిడెన్స్ డిపాజిట్ స్కీమ్ సహా కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపాయి బలోపేతం అవుతుందని రాజన్ చెప్పా రు. భారత్‌లో స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనపడడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా 2013లో రూపాయి అత్యంతగా పతనమైందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201819) జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో భారత్ కరెంట్ ఖాతా లోటు 2.8 శాతానికి చేరవచ్చని నోమురా నివేదిక తెలిపింది. ఇది 201718 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు 1.9 శాతంతో పోలిస్తే అత్యధికంగా ఉంది.

వర్ధమాన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా అభివృద్ధి చెం దుతున్న దేశాల మార్కెట్లు ప్రమాదంలో ఉన్నాయ ని, ఈ దేశాలు ఇంకా అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అనుగుణంగా లేవని రాజన్ తెలిపా రు. వర్ధమాన దేశాలు ఎక్కువగా వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయని,ఇది విషపూరిత సమ్మేళనమైందని అన్నారు. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముందు లాగే మళ్లీ కొంత ఫండమెంటల్స్ అత్యధికంగా ఉన్నాయని గుర్తు చేశారు.

Comments

comments