Home తాజా వార్తలు కోలుకుంటున్న రూపాయి

కోలుకుంటున్న రూపాయి

Rupee hits fresh record low, touches 74.27 against US Dollar

ముంబై: రికార్డు స్థాయి కనిష్టం నుంచి రూపాయి విలువ కోలుకుంటోంది. గురువారం రూపాయి 9 పైసలు పుంజుకుని 74.12 వద్ద స్థిరపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు, ఇతర కరెన్సీ విలువలు కోలుకోవడం వంటివి దేశీయ కరెన్సీకి సానుకూలంగా మారాయి. దీనికి ముందు బుధవారం రూపాయి 18 పైసలు పెరిగి 74.21 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్)లో రూపాయి 74.37 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో కరెన్సీ విలువ 74.50కు పతనమైనప్పటికీ ఆఖరి సమయంలో కోలుకుంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా ఎగుమతిదారులు అమెరికా కరెన్సీని విక్రయించడం ఇందుకు తోడ్పడింది. మొత్తానికి చాలా పతనం తర్వాత దేశీ కరెన్సీ రికవరీ బాటపట్టింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి కొత్త కనిష్ట స్థాయి 74.39కి పడిపోయిన విషయం తెలిసిందే. పండుగల సీజన్‌లో ద్రవ్య లభ్యతను మెరుగుపర్చేందుకు అక్టోబర్ 11న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా రూ. 12,000 కోట్ల మేర నిధులను వ్యవస్థలో అందుబాటులోకి తేవాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.

Rupee hits fresh record low, touches 74.27 against US Dollar