Home జాతీయ వార్తలు పడిపోయిన రూపాయి విలువ

పడిపోయిన రూపాయి విలువ

Rupee worth is Fall

ముంబయి : రూపాయి విలువ గురువారం ఘోరంగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. మొదటిసారి రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 69 రూపాయలు దాటింది. ఇలా రూపాయి విలువ ఇంత ఘోరంగా పడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. క్రూడ్ ఇంధన ధరలు పెరగడంతో రూపాయి విలువ పడిపోయిందని ఇన్వెస్టర్లు చెబుతున్నారు. గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్ విలువతో కనిష్టంగా రూపాయి విలువ 68.89 పైసల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఈ క్రమంలో రూపాయి విలువ 28 పైసలు పడిపోయిందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్ 58.80 పాయింట్లు పడిపోయి 35158 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 32.95 పాయింట్లు పడిపోయింది.

Rupee worth is Fall