Home జిల్లాలు గ్రామాల అభివృద్ధి:జెసి

గ్రామాల అభివృద్ధి:జెసి

mbnrగ్రామస్థుల సహకారంతోనే  గ్రామాల అభివృద్ధి:జెసి
ఇటిక్యాల: గ్రామస్థుల సహాయ సహకారాలతోనే ఆ గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటు ందని జెయింట్ కలెక్టర్ రాంకిషన్ అన్నారు. మం డల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలో రెరెవెన్యూ అధి కారులు రెవెన్యూ దర్భార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు నీరు లేక పోవడంతో కరువు పరిస్థితి తీవ్రంగా ఉందని, గ్రా మానికి రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్ర అంతరాయం కలుగు తుందని జెసి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జూరాల కెనాల్ ద్వారా ఖరీఫ్ పంట సయమానికి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. గ్రామ అభి వృ ద్ధి గ్రామంలోని ప్రజలు ఆలోచన, ఆచరణ పద్దతుల తో పాటు అందరి సమిష్టి కృషి సాధ్యపడుతుంద న్నారు. అలాగే వర్షపు నీరు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని, వ్య వసాయ భూముల్లో చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేప ట్టాలని సూచించారు. దీంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండవచ్చన్నారు. రైతుల భూముల వివరాలు ప్రభుత్వం కంప్యూటరీకరణలో ఆన్‌లైన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎక్కడి నుండైనా సమాచారం తెలుసుకో వచ్చన్నారు. అలా గే కరువు పరిస్థితుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకా న్ని నేటి నుండి అమలు చేయడం జరు గుతుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థుల తల్లిదం డ్రులు సహాకరించి పిల్లలను పాఠశాలకు పంపించాలన్నారు. గ్రామాల్లో వయో జనులందరికీ తప్పని సరిగా సాక్షర భారత్ ద్వారా విద్య నందించాలన్నారు. గ్రామంలోని 8మంది రైతులకు విరాసత్, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఉదండ పురం గ్రామంలో స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలి ంచారు. ఈయన వెంట ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, తహ సీల్దార్ మునెప్ప, ఆర్‌ఐ కృష్ణమూర్తి, విఆర్‌ఓ వెంకట కృష్ణారాజు, గ్రామస్తులు ఉన్నారు.