Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియా ప్రయోగాలపై రష్యా ఆందోళన

Missile

మాస్కో : ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై రష్యా ఆందోళన చెందుతోంది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గె ర్యాబ్కో తెలిపారు. మంగళవారం ఉదయం ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించి హోక్కైడో ఉత్తర ప్రాంతంలోని నదిలో పడింది. ఈ క్షిపణి ప్రయోగాన్ని రష్యా ఖండిస్తుందని సెర్గె ర్యాబ్కో స్పష్టం చేశారు. ఉత్తర కొరియా దూకుడును చూస్తే తమకు చాలా ఆందోళనగా ఉందని ఆయన పేర్కొన్నారు. జపాన్ అధ్యక్షుడు షింజో అబే ఉత్తర కొరియాపై మండిపడ్డారు. ఉత్తర కొరియా చర్యలు తమ దేశానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ప్రపంచ దేశాలు ఖండిస్తూ వస్తున్నాయి. కానీ ఉత్తర కొరియా మాత్రం ప్రపంచ దేశాలను పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాలు చేస్తూనే ఉంది.

Russia concerns over North Korean experiments

Comments

comments