Search
Saturday 22 September 2018
  • :
  • :

సిరియా చేరిన రష్యా క్షిపణి వ్యవస్థ

ROCKETమాస్కో : ఐసిస్‌పై పోరులో రష్యా మరో ముందడుగు వేసింది. గగనతల రక్షణకు సంబంధించి క్షిపణి వ్యవస్థ ఎస్-300ను సిరియాలోని రేవు పట్టణం టార్టస్‌కు చేర్చింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంతిత్వ్ర శాఖ ప్రతినిధి లొగోర్ కొనషిన్‌కోవ్ వెల్లడించారు. వైమానిక దాడులు జరగకుండా రష్యా స్థావరాలను రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇది ఎవరిపైకి గురిపెట్టేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ ప్రాంతంలో పోరును తీవ్రతరం చేసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం వైమానిక దాడులను సమన్వయం చేసుకునేందుకు రష్యాతో సిరియా సమావేశమైంది. ఎస్‌ఏ-23గా సుపరిచతమైన ఎస్-300 వ్యవస్థను ఇప్పటి వరకు రష్యా బయట వినియోగించలేదు. దీనిని పూర్తిగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. దీని రాడర్లు, లాంఛర్లు, కమాండ్ వ్యవస్థను ట్రకులపై తరలించే వీలుంది. దీనికి ఎస్-400 వ్యవస్థను కూడా పూర్తిస్థాయి వైమానిక నిరోధక వ్యవస్థ సిద్ధమైపోతుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ సమీపంలోని రష్యా వైమానికస్థావరమైన లటాకియాలోఉంది.

Comments

comments