Search
Monday 24 September 2018
  • :
  • :

రష్యా ఓపెన్ విజేత సౌరభ్ వర్మ

sourabh

వ్లాదివొస్తోక్: భారత షట్లర్ సౌరభ్ వర్మ ప్రతిష్టాత్మకమైన రష్యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ సౌరభ్ వర్మ జపాన్ ఆటగాడు కొకి వతనాబెను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీ పోరాటంలో సౌరభ్ 1921, 2112, 2117తో విజయం సాధించాడు. అయితే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జంట ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు సౌరభ్ అసాధారణ పోరాట పటిమతో వతనాబెను ఓడించాడు. చివరి వరకు పోర నువ్వానేనా అన్నట్టు సాగింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత ఆటగాడు సౌరభ్ తన ఖాతాలో ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ప్రారంభం నుంచే వతనాబె నుంచి సౌరభ్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. తొలి గేమ్‌లో వతనాబె ఆధిపత్యం చెలాయించా డు. సౌరభ్‌ను ఒత్తిడికి గురి చేస్తూ ముందుకు సాగాడు. ఒత్తిడికి గురైన సౌరభ్ మొదటి సెట్‌లో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వతనాబె సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సౌరభ్ పుంజుకున్నాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడిన సౌరభ్ గేమ్‌పై పట్టు సాధించాడు. సౌరభ్ చెలరేగి ఆడడంతో వతనాబె ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలు చేశాడు. దీంతో సౌరభ్‌కు అలవోక విజయం దక్కింది. ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో కూడా పోరు ఉత్కంఠభరితంగానే సాగింది. ఒక దశలో జపాన్ ఆటగాడు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించాడు. అయితే అసాధారణ పోరాట పటిమను కనబరిచిన సౌరభ్ మళ్లీ పైచేయి సాధించాడు. వతనాబెను ఓడించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో భారత జంట రోహన్ కపూర్‌కుహూ గార్గ్ ఓటమి పాలైంది. వ్లాదిమర్ ఇవనోవ్ (రష్యా)మిన్ యుంగ్ (కొరియా) జంటతో జరిగిన పోరులో భారత జోడీ 1921, 1721తో పరాజయం చవిచూసింది.

Comments

comments