Home అంతర్జాతీయ వార్తలు రష్యాలో విమాన ప్రమాదం

రష్యాలో విమాన ప్రమాదం

russia-plane-crash-51458382ఇద్దరు భారతీయులు సహా 62 మంది దుర్మరణం
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరి గింది. శనివారం ఉదయం దుబాయ్‌కి చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం రష్యాలోని రోస్తవ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయం లో కుప్పకూలిపోయింది. విమానం ల్యాండ్ అవు తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 62 మంది మృతిచెందారు. మృతులలో ఇద్దరు భారతీ యులు, 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారున్నారు. మృతిచెందిన భారతీయులిద్దరినీ అంజు కథిర్వెల్ ఐ యప్పన్, మోహన్ శ్యామ్‌గా గుర్తించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమ యంలో మంటలు చెలరేగి విమానం కుప్పకూలడంతో విమాన శకకాలు చెల్లా చెదురయ్యాయి. ఈ ప్రమాదంతో రోస్తవ్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఘటనా స్థలికి చేరుకున్న విమానయాన సిబ్బ ంది సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 62 మంది ప్రయాణిస్తుండగా వారంతా ప్రమాదంలో మరణించినట్టు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ధ్రు వీకరించింది. మృతుల బంధువులతో సంప్రదిస్తున్నామని, అవసరమైన సహా యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యన్ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు. విమానం కుప్పకూలగానే మంటలు పెద్దఎత్తున చుట్టపక్కలకు వ్యాపించా యని, మంటలను అదుపుచేసేందుకు సిబ్బందికి గంటకు పైగా సమయం పట్టిందని అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 700 మందికి పైగా సిబ్బందిని, 100 వాహనాలను సహాయక చర్యల్లోకి దింపారు. విమానా నికి చెందిన ఒక బ్లాక్ బాక్స్‌ను కూడా సేకరించినట్టు దర్యాప్తు అధికారులు ధ్రు వీకరించారు. గ్రౌండ్‌ను తాకగానే విమానం మంటల్లో చిక్కుకుని ముక్క చెక్కలై నట్టు, శకలాలు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వరకూ చెల్లాచెదురైనట్టు వారు చెప్పారు. వాతావరణ ప్రతికూలత కారణంగా విమానం కిందకు దిగేం దుకు రెండు గంటల సేపు చక్కర్లు కొట్టిందని రష్యన్ ఔట్‌లెట్ లైఫ్ న్యూస్ తెలిపింది.
పుతిన్ విచారం
విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. ప్రమాద ఘట నపై రవాణా, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రిత్వ శాఖలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రమాద ఘటన అనంతరం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన, నిర్లక్షం వంటి కారణాలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చా అనే కోణంలో ఈ దర్యాప్తు జరగనుంది. సిబ్బంది పొరపాట్లు, సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితి, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిజనిర్ధారణ జరుపుతామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మర్కిన్ రష్యా న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.