Home ఎడిటోరియల్ మధ్యప్రాచ్యంలో అమెరికాను వెనక్కు నెట్టిన రష్యా

మధ్యప్రాచ్యంలో అమెరికాను వెనక్కు నెట్టిన రష్యా

Russiaమధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యం ము గిసింది. సామ్రాజ్యవాద పోట్లగిత్త తలవంచినట్లు ఇప్పు డు సుస్పష్ట మవుతోంది. అమెరికా పెత్తనం, ఆధి పత్యం ఈ విధంగా తొలగించబడుతుందని ఎవ రూ ఎప్పుడూ ఊహించి ఉండరు. రష్యా సెప్టెంబర్ ౩౦న సిరియాలో విజయవంతంగా సైనిక జోక్యం చేసు కోవటం అమెరికా ఆధిపత్యానికి అడ్డుక ట్ట వేసి ంది. అమెరికన్ ఆధిపత్య అనే బూటకపు గోడ ఒక దెబ్బతో కూలిపోయింది.
తిరుగుబాటుదారులు, జిహాదీ గ్రూపులపై చర్యకై సైనిక సహాయం కొరకు అధ్యక్షుడు బషర్ అల్-అ స్సాద్ నేతృత్వం వహిస్తున్న సిరియా ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానంపై రష్యా జోక్యం చేసు కుంది. రష్యా ప్రాథమిక ధ్యేయం తిరుగుబాటు దారులపై సిరియా పోరాటానికి సహాయ పడ టం, అల్-నుప్రత్ ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అమెరి కా మద్దతు గల గ్రూపులు సహా కలిగివున్న ఆర్మీ ఆఫ్ కాం కెస్ట్ అధీనంలోనుంచి అది తన భూభాగాలను స్వాధీనం చేసు కునేందుకు తోడ్పాటివ్వటం. సిరియా రష్యా మిత్ర రాజ్యం. సిరియన్ ఆర్థోడాన్స్ క్రిష్టియ న్‌లు రష్యాను విశ్వసి ంచారు. భౌగోళికంగా చూస్తే యుద్ధం రష్యన్ సరిహద్దులను సమీ పిస్తున్నది. రష్యా ఆగ్రహానికి ప్రధాన కారణం అమెరి కన్ పెత్తందారీ తనం. ప్రపంచ వివాదాల్లో అమెరికా మధ్య వర్తిపాత్ర పొం దటం కూడా రష్యాకు ఇష్టం లేదు. రష్యా చొర వకు అది మరో కారణం.
అమెరికా తన చర్యల్లో చిత్తశుద్ధితో వ్యవహరించి వుంటే సిరియా రష్యా సహాయాన్ని కోరేదికాదు. వాస్త వానికి అది అర్థమనస్కవ్యూహం అనుసరిం చింది. అమెరికా ప్రభుత్వం అనేక నెలల పాటు సైనిక చర్య కొనసాగించింది. అయితే అది తీవ్రవాదులను రూపు మాప లేకపోయింది. అమెరికా నాయ కత్వంలోని మిత్ర రాజ్యకూటమి ఐఎస్‌ఐఎల్‌పై వైమా నిక దాడు లు నిర్వహించింది. అయితే జరిగిందేమి టంటే, టెర్ర రిస్టు గ్రూపుల పట్టుపెరిగింది. ఐఎస్‌ఐఎల్ మరింతగా విస్తరి ంచింది, బలపడింది. కాగా ఐఎస్‌ఐఎల్‌కు వ్యతిరేకంగా తమ చర్యలను సమన్వయపరుచుకు నేందుకు ఇరాన్, ఇరాక్, రష్యా, సిరియా సెప్టెంబర్ మాసాంతానికి బాగ్దాద్ లో సమష్టి సమాచార కేంద్రం నెలకొల్పాయి.
రష్యా అధ్యక్షుడు ఫుతిన్‌కు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన మిత్రరాజ్య కూటమినుంచి జర్మనీ వైదొల గటం కూడా అమెరికా ఆధిపత్యం క్షీణించ టాన్ని తెలియ జేస్తున్నది. సిరియాతో సంఘీభావానికి మాస్కో సంసిద్ధతను జర్మనీ అధికారికంగా ఆహ్వా నించింది. రష్యా, ఫ్రాన్స్‌లతో కలిసి యుద్ధాన్ని ము గించే చొరవ తీసుకుంది.
ఇదిలావుండగా, మధ్యప్రాచ్యంలో మిలిటెంట్ గ్రూపుగా ఐఎస్ ఆవిర్భవించటానికి ఇరాక్‌పై అమెరి కా నాయకత్వం కింద జరిగిన దండయాత్రదే బాధ్య త అని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ అంగీకరి ంచటం మరో ఘటన. ఇరాక్‌పై యుద్ధం ఐఎస్ ఆవి ర్భావానికి కారణమన్న వాదనలో “వాస్తవం లేకపో లేదు” అని ఆయన అన్నారు. సద్దాం హుస్సేన్ సా మూహిక విధ్వంసక ఆయుధాలు కలిగివున్నట్లు త ప్పుడు వాదనపై ఆధారపడి ఇరాక్‌లోకి బ్రిట న్ సైన్యా లను పంపిన బ్లెయర్ నిర్ణయం ఇప్పటికీ తీవ్ర మైన వివాదాంశంగా ఉంది.
అదాలావుంచితే, సిరియాలో తమ సైనిక చర్య ప్రారంభించే ముందు, బాగ్దాద్‌లో సమాచార కేం ద్రంలో చేరాల్సిందిగా అమెరికాను ఆహ్వానించినప్ప టికీ, వారి స్పందన నిర్మాణాత్మకంగా లేదని రష్యా విదే శాంగమంత్రి సెర్గీ లెవరోవ్ వెల్లడించారు. సిరి యాలో చర్యలపై తమ మధ్య సహకారానికి ప్రతినిధి వర్గాలు పరస్పర పర్యటనకు ఫుతిన్ చేసిన ప్రతిపా దనను కూడా అమెరికా తిరస్కరించింది.
మొట్టమొదటి నుంచి పశ్చిమ ప్రపంచం వ్యూహం ఒక్కటే : అస్సాద్‌ను సిరియా నుంచి వెళ్లగొ ట్టటం. ఐఎస్‌ఐఎల్‌పై, ఇతర టెర్రరిస్టు గ్రూపులపై త మ పోరాటం గూర్చి వారి ప్రచారం కన్నీటి తుడు పు మాత్రమే. అమెరికాకు విధేయతగల గ్రూపునకు దన్నుగా నిలబడటానికి వారు ఎక్కువ ఆసక్తి చూ పారు. అస్సాద్‌కు రష్యా తోడ్పాటు కొనసాగింపు సం ఘర్షణను విస్తరిస్తుందని, రాజకీయ పరిష్కారంపై కూ డా దృష్టి పెట్టకపోతే తీవ్రవాదంపై పోరాటం అనే అంగీకృత లక్షం దెబ్బతింటుందని అమెరికా విదే శాంగమంత్రి జాన్‌కెర్రీ అభిప్రాయపడ్డారు. యుద్ధా నికి రాజకీయ పరిష్కారానికై ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని రష్యా విదేశాంగమంత్రి ప్రతిపాదించారు కూడా. పశ్చిమదేశాలు బలపరుస్తున్న ఫ్రీ సిరియన్ ఆర్మీ స్థావరాలు ఎక్కడన్నాయో తెలిస్తే వారితో మా ట్లాడ టానికి కూడా రష్యా సంసిద్ధంగా ఉందన్నారు. రష్యా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించని అమె రికా, దాని మిత్రరాజ్యాలు రష్యా జోక్యాన్ని ప్రపంచ శాంతికి ముప్పుగా చిత్రిస్తున్నాయి. రెండు నా ల్కల ధోరణి అంటే ఇదే.
అస్సాద్ కూలిపోతున్నందున అతనికి అండగా ఫుతిన్ బలంతో గాక బలహీనతతో సిరియాలోకి వెళ్లా డని, విఫలమవుతాడంటూ అధ్యక్షుడు ఒబామా తమ మిత్రులను ఓదార్చినప్పటికీ, అస్సాద్ ప్రభుత్వ వ్యతిరే కులపై ఫుతిన్ బాంబుదాడులు అతని విదేశాంగ వి ధాన ప్రతిష్టను పెంచిందని స్వతంత్ర పరి శీలకులు సైతం అంగీకరిస్తున్నారు. టెర్రరిజంపై పోరాడే ఏకైక శక్తిగా నిలబడిన రష్యా, ఈ ప్రాంతం భవి ష్యత్ రాజ కీయ రూపాన్ని నిర్ణయించటంలో కీలకపాత్ర పోషిం చనుంది.
అమెరికా తన సొంత ప్రయోజనాలు, లాభాల గూర్చి ఆలోచిస్తుండగా, రష్యా, ఇరాన్, సిరియాలతో కలిసి ఐఎస్‌ఐఎల్ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్ర య త్నిస్తున్నది. అల్-అస్సాద్‌ను బలపరుస్తున్న మరో ముఖ్య దేశమైన ఇరాన్‌తో సంబంధం దానికి అదనపు అవకాశం కల్పిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల్లో రష్యా నిర్మాణాత్మ క ంగా వ్యవహరించింది.
సిరియాలో ఫుతిన్ ఉద్దేశాలు బహుముఖీయం. ఉక్రె యిన్‌లో అసంపూర్ణ సాహసం నుంచి దృష్టి మర ల్చాలని కోరుకుంటున్నాడు. అమెరికా విఫలమైన చోట సాహసంతో వ్యవహరించే అగ్రరా జ్యం గా రష్యా ప్రతిపత్తిని తిరిగి పొందాలని కోరుకు ంటున్నా డు. జిహాదిస్టులు ఐఎస్‌ఐఎస్‌లో చేరటం పట్ల నిజం గా ఆందోళన చెందుతున్నాడు. వారు రష్యాకు తిరిగి వస్తే అది వినాశకరంగా పరిణమిస్తుంది.
ఇరాక్ ఆ ప్రాంతంలో శాంతి స్థాపనను గట్టిగా అభి లషిస్తున్నందునే రష్యాను బలపరుస్తున్నది. వా యవ్య ఇరాక్‌లో ఐసిస్ జిహాదిస్టులతో 16 మా సాల పోరాటం తదుపరి వారిని వెనక్కి కొట్టటం రష్యా వైమానిక దాడుల తర్వాతే సాధ్యమైంది.
మరింతగా బహుళధృవ ప్రపంచానికి అనుకూల ంగా, అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే వ్యూహా త్మక లక్షం రష్యాకుంది. ఈ విషయంలో రష్యా, చైనాలు, తమ సొంత ప్రభావ ప్రాంతాలను కాపా డుకుం టేనే అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పర స్పరం సహకరించుకుంటున్నాయి.
(ఐపిఎ)