Home తాజా వార్తలు రష్యా విమానానికి బాంబు బెదిరింపు

రష్యా విమానానికి బాంబు బెదిరింపు

RUSSIA

బెంగళూరు: కేరళలోని కొచ్చిన్ నుంచి బెంగళూరు మీదుగా మాస్కోకు వెళ్లాల్సిన ఎయిర్ రష్యా విమానాన్ని పేల్చివేస్తామంటూ బుధవారం రాత్రి దుండగుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో నిలిపివేశారు. దుండగుల బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన సిఐఎస్‌ఎఫ్ దళాలు బుధవారం రాత్రి పది గంటల సమయంలో రంగంలోకి దిగారు. విమానం నుంచి ప్రయాణికులను దించేశారు. భద్రతమైన చర్యలన్నీ తీసుకున్న తరువాతే రష్యన్ విమానాన్ని పంపిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.