Home అంతర్జాతీయ వార్తలు పుతిన్‌తో కిమ్ భేటీ

పుతిన్‌తో కిమ్ భేటీ

Putin and Kimరష్యా : అణ్వాయుధాల వాడకంపై అమెరికాతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కిమ్‌ భేటీ అయ్యారు.  వ్లాదివోస్తోక్‌లోని ఫార్‌ ఈస్ట్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. ఈ భేటీ కోసం  కిమ్‌ ప్రత్యేక రైలులో బుధవారం వ్లాదివోస్తోక్‌ చేరుకున్నారు. పుతిన్‌ గురువారం  ఇక్కడికి వచ్చారు. పుతిన్‌ కిమ్‌కు ఘన స్వాగతం పలికారు. భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిపారు.  కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పుతిన్‌ తేల్చి చెప్పారు. కొరియాలో శాంతి స్థాపనకు రష్యా చేసేందుకు కిమ్‌ పర్యటన దోహదం చేస్తుందని పుతిన్‌  పేర్కొన్నారు.  ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని పుతిన్ ఆకాంక్షించారు. 2011లో ఉత్తరకొరియాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన సమావేశమైన ఆరో దేశాధినేత పుతిన్‌ కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కిమ్ రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలు విఫలమయ్యాయి.  ఆ తరువాత రష్యా అధినేత పుతిన్‌తో కిమ్‌ సమావేశమయ్యారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Russian President Putin Meeting with Kim