Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్…

Oppo RX17 Pro

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఆర్‌ఎక్స్17 ప్రొ ను యూరప్ మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. దీంట్లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో ఉంది. దీని సహాయంతో కేవలం 0.41 సెకన్ల వ్యవధిలోనే డివైస్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఒప్పో. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ వూక్ ఫ్లాష్ చార్జ్‌ను అందిస్తోంది. కావున ఫోన్ 0 నుంచి 40 శాతం చార్జింగ్ అవ్వడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ వేరియెంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.49వేల ధరకు కస్టమర్లకు నవంబర్ 16వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ అద్భుత ఫీచర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిగ్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

6/8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, ఎన్‌ఎఫ్‌సి, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

RX 17 Pro Smartphone from Oppo

telangana latest news

Comments

comments