Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆరేళ్లకే రూ.71 కోట్ల సంపాదన!

Ryan Toys Review is a child YouTube star

పేరు రియాన్. వయసు ఆరేళ్లు. అమ్మ టాయ్స్ రివ్యూ ఛానల్ నడిపేది. అమ్మతో పాటు ఉండి అన్ని వీడియోలన్నీ ఆసక్తిగా గమనించేవాడు. రియాన్‌లోని ఉత్సాహాన్ని గమనించిన వాళ్ల అమ్మ రియాన్‌తోనే వీడియోలు తీయడం ప్రారంభించింది. యాంగ్రీ బర్డ్… సూపర్ హీరో వంటి కార్టూన్ టాయ్స్, లేగో బ్రిక్స్ బొమ్మలు… రైళ్లు, విమానాలు ఇలా ఎన్నెన్నో కొత్తగా వచ్చిన పిల్లల బొమ్మలతో కెమెరా ముందు ఆడుకుంటూండేవాడు. అవి ఎలా ఉన్నాయో చక్కగా చెప్పేస్తాడన్నమాట. ఆ చిన్నారి వీడియోలను అప్‌లోడ్ చేసేవారు. క్రమంగా అంతర్జాలంలో అభిమానులు పెరిగారు. ఆ వీడియోల్ని కొన్ని లక్షలమంది వీక్షించారు. బోలెడన్ని ప్రకటనలూ వచ్చాయి. 2015లో ‘రియాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. దీంతో ఈ ఏడాదిలో రియాన్ 11 మిలియన్ డాలర్ల డబ్బును తెచ్చుకున్నాడు. అంటే మన రూపాయల్లో దాదాపు 71 కోట్లు. యూ ట్యూబ్ ద్వారా ఎక్కువ సంపాదించిన వారిలో ఒకడిగా రియాన్ నిలిచిపోయాడు. అందరి పిల్లల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే మిలియన్ల డబ్బును తన అకౌంట్‌లో వేసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Comments

comments