Home తాజా వార్తలు చిందేసిన రైతుబంధు

చిందేసిన రైతుబంధు

The farmer's penny penny schedule ended yesterday

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు చెక్కుల పం పిణీ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 10,052 గ్రామాల్లో 37.54 లక్షల చెక్కులను అధికారులు రైతులకు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. వీటి విలువ రూ. 3,100 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. కొన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయి సమాచారం రాలేదని, అది వచ్చిన తర్వాత చెక్కుల పంపిణీ వివరాల్లో కొంత మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాల కలెక్టర్ల అనుమతి తో ఈ నెల 20వ తేదీ వరకు కొన్ని గ్రామాల్లో చెక్కులను పంపిణీ జరగనుంది. ఎక్కువ సంఖ్యలో చెక్కులు మిగిలిపోయిన, ఇప్పటికీ గ్రామసభలు పెట్టని గ్రామా ల్లో 20వ తేదీ వరకు పంపిణీ చేస్తారని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా 10,653 గ్రామాల్లో 58.33 లక్షల చెక్కుల పంపిణీ లక్షంగా ఉంది. ఇదిలా ఉండగా గ్రామాల్లో చెక్కులు పొందని రైతులు వాటిని సంబంధిత మండల కేంద్రాల్లో పొందాల్సి ఉంటుంది.
ఆర్‌ఒఎఫ్‌ఆర్ చెక్కులకు 7 డిజిట్ సీరిస్ : అటవీ భూములపై హక్కులు (ఆర్‌ఒఎఫ్‌ఆర్) కలిగిన రైతులకు ఇచ్చే చెక్కులపై పట్టాదారు పాస్‌బుక్ నెంబర్‌ను పేర్కొనే స్థానంలో పన్నెండు అంకెలకు బదులుగా 7 అంకెల నెంబర్ ఉండనుంది. ఆర్‌ఒఎఫ్‌ఆర్ రైతులకు పట్టదారు పాస్‌బుక్‌లు ఉండనందువల్ల ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగదుగా మార్చుకునే సమయంలో చెక్కుదారుడిని గుర్తుపట్టేందుకు బ్యాంకులకు కూడా ఇదే నెంబర్‌ను ఇచ్చారు. మొత్తం 1198 గ్రామాల్లో 91,992 మంది రైతులకు 2.99 లక్షల ఎకరాల ఆర్‌ఒఎఫ్‌ఆర్ భూములు ఉన్నాయి. వీరికి రూ. 119.59 కోట్లు రైతుబంధు కింద అందనున్నాయి.