Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సన్న, చిన్న కారు రైతులకు కన్నీరు

 Ryth Bandhu  scheme is just for landlords

మన తెలంగాణ/ములుగు: సన్న, చిన్న కారు రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని రైతుబంధు పథకం భూస్వాములకే న్యాయం జరిగిందని సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతులకు వెంటనే న్యాయం చేయాలని సీతక్క డిమాండ్ చేసింది. ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్‌ఓఆర్ బుక్కులను ఇస్తామంటు భూ రికార్డుల్లో 3 లక్షలు తప్పులు అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ 30 లక్షల భూ రికార్డుల తప్పులు ఉన్నాయని ఇవి సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరుగలేదని రైతుబంధు పథకం ఏర్పాటు చేసి ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం ఆర్‌ఓఆర్ బుక్కులు రాలేదని సాగుకు సమయం ఆసన్నమైనప్పటికి రైతులు తహసీల్దార్  కార్యాలయాల వెంట రోజుల తరబడి తిరుగుతున్నప్పటికి రైతుల పనులు కావడం లేదన్నారు. ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతులు మాత్రం పనులు వదులుకుని ఆఫీసుల చుట్టు తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన తప్పుడు విధానాలను మార్చుకోవాలని లేని పక్షంలో రైతులకు మోసం చేస్తే ఉరుకునేది లేదని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట డివిజన్ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకో చేస్తామంటు వారు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ అతని వృత్తి అతను చేసుకోకుండా పోలీస్ స్టేషన్‌కు పోయిన బాధితులను ఎస్‌ఐ నువ్వు ఏ పార్టీ అని అడుగుతూ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని టిఆర్‌ఎస్ పార్టీలోనే ఉండాలని పోలీస్ స్టేషన్ పొయిన వారిని వేదిస్తున్నాడు.  టిఆర్‌ఎస్ పార్టీకి రావాలని లేనిచో వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అంటున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారికి దృష్టికి తీసుకపోతామని అన్నారు. ఇప్పటికైన ఎస్‌ఐ ఇలాంటి తప్పుడు విధానాలను మార్చుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీకి అందరిని చేరాలనుడు తప్పు అని వారు అన్నారు. ఇలాగే కొనసాగిస్తే పోలీస్ స్టేషన్ ముందు డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తామంటు వారు అన్నారు. రైతులు అకాల వర్షంతో రెండు సార్లు లక్షల కొద్ది లాసు అయినప్పటికి రైతులను పట్టించుకోకుండా రైతులకు నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదని రైతు బందు పేరుతో భూస్వాములకు న్యాయం చేస్తు నష్టపోయిన రైతులకు ఏలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని వారు అన్నారు. రైతులు పండించిన ఐకెపి కేంద్రాల వారు కొనుగోలు చేయగా రైతుకు ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు రాలేదని ఇది ఎంతో సిగ్గుచేటని వారు అన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు వారి వారి అకౌంట్ లలో వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు నల్లెల్ల కుమారస్వామి, మసరగాని వియన్ కుమార్, కోగిల మహేష్, చంద్రమౌళి, రాములు, బొమ్మకంటి రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

comments