Home తాజా వార్తలు సాహో కొత్త పోస్టర్ విడుదల… బైక్‌పై ప్రభాస్ పోజ్

సాహో కొత్త పోస్టర్ విడుదల… బైక్‌పై ప్రభాస్ పోజ్

Saaho

హైదరాబాద్: సాహో చిత్ర బృందం మరో పోస్టర్‌ను విడుదల చేసింది. సాహో మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ చెవులో బ్లూటూత్ డివైస్ పెట్టుకొని బైక్ రైజింగ్ చేశాడు. ప్రభాస్‌పై ఉన్న క్రేజీతో రోజు రోజు సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్‌కు తోడుగా శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల వ్యయంతో సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  చిత్రంలో మందిరా బేడీ, జాకీ ష్రాప్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, నీల్ నితిన్ ముకేష్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు విడుదలైన పోస్టర్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  

 

Saaho Movie: Rebel Star Prabhas New Poster Released