Home తాజా వార్తలు స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు

స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు

Prabhas

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ బాహుబలి 1, 2 తర్వాత ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రభాస్ న్యూ లుక్ పోస్టర్ రికార్డు లైక్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా కలర్‌ఫుల్ రిచ్ పబ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ పాటలో ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగిస్తారట. యువి క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Saaho Shooting Action Scenes at Annapurna studios