Home తాజా వార్తలు సాహో యాక్షన్ సీన్స్ అదరహో

సాహో యాక్షన్ సీన్స్ అదరహో

 

‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠను మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇప్పుడు ఈ స్టార్ హీరో తన అభిమానులు గర్వపడే విధంగా ‘సాహో’ టీజర్‌ను అందించారు. గురువారం విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన క్షణం నుంచి అద్భుతమైన స్పందనతో దుమ్ము దులిపేస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేకింగ్ వీడియోలలోనే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పిన దర్శకుడు సుజిత్ ఇప్పుడు టీజర్‌లో మరింత అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్‌తో వరల్డ్‌క్లాస్ మేకింగ్ చూపించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా అయితే చేయాలని అభిమానులు కోరుకున్నారో ‘సాహో’ అచ్చం అలాగే ఉంది. టీజర్‌లో కనిపించిన యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగిందంటూ… ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్‌గా, కొత్త ఎనర్జీతో కనిపించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, -ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సాహో’ను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ ‘సాహో’ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Saaho teaser launched