Home తాజా వార్తలు తెలంగాణలో రెండు గ్రామాలకు సాక్షర భారత్ అవార్డులు

తెలంగాణలో రెండు గ్రామాలకు సాక్షర భారత్ అవార్డులు

Sakshara-bharath1ఢిల్లీ: సాక్షర భారత్ అవార్డులను తెలంగాణ రాష్ట్రంలోని రెండు గ్రామాలు అందుకున్నాయి. గురువారం జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై, అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వీర్నవల్లి, బకారం గ్రామాలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ గ్రామాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో అవార్డులు వరించాయి. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం బకారం గ్రామాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారి దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.