Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మూత పడుతున్న సాక్షర భారత్ కేంద్రాలు

Sakshara-bharath-centersమెదక్: వయోజన విద్య..మిథ్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి అక్షరాస్యత సాధన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాక్షరభారత్ కార్యక్రమం ప్రభుత్వ తీరు అధికారుల నిర్లక్షంతో ముందుకు సాగే పరిస్థితి కనబడుట లేదు, దీంతో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. వయోజనులకు చదువు చెబుతున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా 6నెలలుగా సర్కార్ ఇవ్వకపోవడంతో వారంతా చదువు చెప్పడానికి ఆర్ధిక పరిస్థితులు అవరోదంగా తయారైంది. మరో వైపు చాలా గ్రామాలలో వయోజన విద్యా కేంద్రాలు పంచాయతీ కార్యాలయల్లో నడుస్తుండడం, స్థానిక పంచాయతీ సెక్రటరీలకు ఒక్కటికి మించి పంచాయతీలు ఉండటంతో అధిక పని భారంతో పట్టించుకోక పోవడంతో కేంద్రాలన్నీ మూతపడుతున్నాయి.
తెరుచుకోని కేంద్రాలు
చాలా చోట్ల సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు.6మాసాలుగా గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ,మండల కోఆర్డినేటర్లు ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలకు సోంత భవనం లేకపోవడం, గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శుల సహకారం కూడ తప్పనిసరిగా మారింది. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడం, మరికోన్ని చోట్ల ఆయ గ్రామాల సర్పంచ్‌లు తమకు అనుకూలంగా లేకపోతే ఇబ్బందులకు గురిచేయడం పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం వల రాజకీయ జోక్యంతో మానసికంగా కో ఆర్డినేటర్లను కుంగదీయడంతో కూడ కేంద్రాలు సక్రమంగా నడవటం లేదు. దీంతో వయోజన విద్యా కేంద్రాలు మూతపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పనిచేసే కూలీలో సింహ భాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. ఇప్పటికైన సంభందిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సాక్షర భారత్ కేంద్రాలకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేసి విధిగా వారి గౌరవ వేతనంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే సత్పాలితాలు వచ్చే ఆవకాశం ఉంది.

Comments

comments