Home తాజా వార్తలు కెసిఆర్‌ను కలిసిన సబిత

కెసిఆర్‌ను కలిసిన సబిత

టిఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనమే, కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల టికెట్?

Sabitha Indra Reddy

 

మన తెలంగాణ /హైదరాబాద్: చేవెళ్ళ కాంగ్రెస్ శాసనసభ్యురాలు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కు మారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. గత కొన్నిరోజులుగా కాం గ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న సబితా ఇం ద్రారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రితో దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం ఆమె టిఆర్‌ఎస్‌లో చేరడం లాంఛనప్రాయమే. త్వరలోనే చేవెళ్ళలో భారీ బహిరంగసభకు సబిత ఏర్పాట్లు చేసి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానించి ఆ సందర్భ ంగానే ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. చేవెళ్ళ నుంచి కార్తీక్‌రెడ్డికి టికెట్ ఇవ్వడానికి కూడా కెసిఆర్ సుముఖంగా ఉన్నారని, సబితకు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున పోటీ గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడం, ఆయనకు టికెట్ ఇవ్వడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే కొనసాగితే కార్తీక్‌రెడ్డికి టికెట్ రాదని భావించిన సబిత టిఆర్‌ఎస్‌లో చేరడమే ఉత్తమమని భావించినట్లు ఆమె సన్నిహితు లు తెలిపారు.

రెండు గంటల పాటు కెసిఆర్‌తో చర్చలు జరిగిన అనంతరం సబిత, కార్తీక్‌లు సంతృప్తి చెందినట్లు సమాచారం. భేటీ గురించి కార్తీక్‌రెడ్డి తన సన్నిహితులకు వివరించి కెసిఆర్‌తో చర్చల అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారని తెలిసింది. చేవెళ్ళ నుంచి టిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వనున్నట్లు స్వయంగా కెసిఆర్ చెప్పినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరాలనేది కెసిఆర్ నిర్ణయిస్తారని, అయితే చేవెళ్ళ నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగసభలో కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు కార్తీక్ తన సన్నిహితులకు తెలియజేసినట్లు సమాచారం. పార్టీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అనేక అంశాలపై కూడా రెండు గంటల సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు కార్తీక్‌రెడ్డి మీడియా ప్రతినిధికి వివరించారు.

కాంగ్రెస్‌లో చేవెళ్ళ టికెట్ రానందుకే..

పార్లమెంటు ఎన్నికల్లో కార్తీక్‌రెడ్డికి చేవెళ్ళ లోక్‌సభ స్థానంలో పోటీచేసేందుకు టికెట్ రాదనే సంగతి స్పష్టం కావడంతో టిఆర్‌ఎస్‌లో చేరాలని సబిత నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో అసహనంతో, అసంతృప్తితో ఉన్న సబిత ఏ క్షణమైనా టిఆర్‌ఎస్‌లో చేరవచ్చనే ఊహాగానాలు రావడంతో ఆమె స్పందించి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, టిఆర్‌ఎస్‌లో చేరాలనే ఉద్దేశం లేదని ఇటీవల జరిగిన సిఎల్‌పి సమావేశంలో వ్యాఖ్యానించారు.  తాను కాంగ్రెస్‌ను వీడడం లేదన్న అంశాన్ని ఏ విధంగా అర్థం చేయించాలో తెలియడంలేదని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని కూడా వ్యాఖ్యానించారు. పార్టీ మారనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ బుజ్జగింపు చర్యలేవీ ఫలితాలు ఇవ్వలేదు. చివరకు టిఆర్‌ఎస్‌లో చేరాలనే ఆమె, కుమారుడు కార్తీక్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.