Home తాజా వార్తలు రాష్ట్రాభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నాను: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రాభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నాను: సబితా ఇంద్రారెడ్డి

 Sabitha Indra Reddy

హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలు సంఘటిత శక్తిగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల భివృద్ధిపై దృష్టి సారిస్తుందని మాజీ హోంశాఖమంత్రి, కాంగ్రెస్ ఎంఎల్‌ఏ సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికి ఆదర్శం అవుతున్న నేపథ్యంలో అభివృద్ధికోసం నావంతు కృషి చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్లు సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. గురువారం టిఆర్‌ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ నాయకులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశమై టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సదర్భంగా అమె మాట్లాడుతూ పార్టీ ఎందుకు మారాల్సివచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికల్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే పార్టీ మారక తప్పలేదని ఆమె వివరించారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రావాలంటే రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు బలంగా ఉండాలనే సంకల్పంతో నా భర్త దివంగత ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారని ఆమెగుర్తు చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందని ఎంఎల్‌ఏ సబితా చెప్పారు. 19 సంవత్సరాలుగా నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అయితే రాష్ట్రాభివద్ధే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీలో నాతోపాటు చేరుతున్న నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీ లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారందరితో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. జిల్లాలో సాగు, తాగు నీటి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు.

 Sabitha Indra Reddy meets  CM KCR likely to join TRS