Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఉద్వేగంతో సచిన్ బన్సాల్ ఫేస్‌బుక్ పోస్ట్

sachin-bansal

మెగా డీల్ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ సంస్థ నుంచి వైదొలిగారు. ఆయనకు సంస్థలో 5 శాతం వాటా ఉండగా.. దీని విలువ రూ.7 వేల కోట్లు అంచనా వేశారు. అయితేఅమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు(రూ.1.02 లక్షల కోట్లకు) కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో సచిన్ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. ఫ్లిప్‌కార్ట్ విక్రయంపై ఆయన స్పందించారు. మెగా డీల్‌పై అధికారికంగా ప్రకటించిన కొద్ది గంటల తర్వాత సచిన్ పేస్‌బుల్‌లో ఓ పోస్టు పెట్టారు. ఉద్వేగానికి లోనైన ఆయన ఫ్లిప్‌కార్ట్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 11 ఏళ్ల వ్యాపారంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని అన్నారు. ఇంతటితో ఫ్లిప్‌కార్ట్‌లో నా పని పూర్తయ్యిందని, ఫ్లిప్‌స్టర్స్ మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని అన్నారు. దేశీయ మార్కెట్ రంగంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించామని, అలా పదేళ్లు గడిచిపోయాయని అన్నారు. అయితే బాధాకర విషయమేంటంటే, ఇంతటితో ఫ్లిప్‌కార్ట్‌లో నా పని పూర్తయ్యిందని, పనులన్నీ అప్పగించి ఫ్లిప్‌కార్ట్‌ను వదిలి వెళ్లే సమయం వచ్చిందని అన్నారు. 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు.

Comments

comments