Search
Monday 23 July 2018
  • :
  • :

సచిన్ టెండూల్కర్ కాదు.. ఫెదరర్ నంబర్ వన్!

Sachin-pedaral-image

లండన్: క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ గ్రేట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రికెట్ గ్రౌండ్ లో ప్రతి షాట్ ఆడే సత్తా మాస్టర్‌ బ్లాక్టర్ కే సొంతం. ఇప్పుడు టెండూల్కర్‌కు ఓ కాంపిటిటర్ వచ్చేశాడు. అతనేవరో కాదు టెన్నిస్ స్టార్ లెజెండ్ రోజర్ ఫెదరర్. వింబుల్డన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో తనలోని సచిన్‌ను ఫెదరర్ మెల్కొలిపాడు. ప్రత్యర్థి ఆడ్రియన్ మానారినో కొట్టిన సర్వీస్‌ను ఫార్వర్డ్ డిఫెన్స్ షాట్‌లాగా ఆడాడు. ఈ వీడియోను వింబుల్డన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఫెదరర్ ఆడిన ఈ ఫార్వర్డ్ డిఫెన్స్‌కు ఏ రేటింగ్ ఇస్తారు అంటూ ఐసిసిని ట్యాగ్ చేయడం విశేషం. దీనికి ఐసిసి వెంటనే స్పందించింది. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ ఫెదరరే అంటూ సరదాగా ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఫెదరర్‌కు సచిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ మంచి మిత్రులు కూడా. సమయం దొరికినప్పుడల్లా సచిన్ టెండూల్కర్ కూడా వెళ్లి ఫెదరర్ ఆడే గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లను చూస్తుంటాడు.

Comments

comments