Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బ్రిడ్జి కోసం నిధులను మంజూరు చేసిన సచిన్

SA

ముంబయి: మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపి సచిన్ టెండూల్కర్ తన ఎంపిల్యాడ్స్ నిధుల నుంచి ముంబయి ఫూట్ ఓవర్ బ్రిడ్జ్‌ పునర్నిర్మాణం కోసం రూ.2 కోట్లు విడుదల చేశారు. ఇటీవల ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు, పార్లే సబర్‌బన్ రైల్వే స్టేషన్‌ల మధ్య ఉన్న ఫూట్ ఓవర్ బ్రిడ్జ్‌పై జరిగిన తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు సచిన్ లేఖ రాశారు. ముంబయి సబర్‌బన్ జిల్లా కలెక్టర్ సంబంధిత పనులు చేపట్టేవిధంగా చూడాలని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ముంబయి ప్రజలకు సేవలు అందించేందుకు తాను వెంటనే ముందుకు వస్తున్నట్లు లేఖలో తెలిపారు. ముంబయి సబర్‌బన్ సర్వీసుల కోసం రెండు వేర్వేరు ఇండిపెండెంట్ జోన్లను ఏర్పటు చేయాలని కూడా సచిన్ ఈ లేఖలో రేల్వే శాఖమంత్రిని కోరారు.

Comments

comments