Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మానవత్వం చూపుదాం…

Sachin-Save-to-Bird-Life

ముందు సోషల్‌మీడియా ప్రభావంతో ఏ చిన్న పనిచేసినా అది వైరల్ అవుతోంది. అది మంచిపనైతే పదిమందికి స్ఫూర్తిగా ఉంటోంది. తాజాగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేసిన ఓ మంచి పని వైరల్ అవుతోంది. ఇంతకీ సచిన్ ఏంచేశాడనేనా…సచిన్ ఇంటి బాల్కనీలోకి ఓ పక్షి వచ్చింది. దప్పికతో, గాయాలతో ఎగురలేని పరిస్థితిలో ఉంది. అది గమనించిన సచిన్ దానికి ఆహారం, నీటిని అందించాడు. అయినా ఆ పక్షి కదల్లేక పోయింది. దీంతో ఆయన ఓ ఎన్జీవోకి ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్జీవో సిబ్బంది దానికి వైద్యం అందించారు. పక్షి డీహైడ్రేట్‌కు గురి కావడం వల్ల లేవలేకపోయిందని సిబ్బంది చెప్పారు. మూడు రోజుల తర్వాత ఆ పక్షి పూర్తిగా కోలుకుంది. స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరిపోయింది.
ఈ వీడియోను సచిన్ సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షులు,  జంతువులను కాపాడుకోవడం మన కర్తవ్యం. బాల్కనీల్లో వాటి కోసం కొంత ఆహారం, కొంచెం నీళ్లు పెట్టండి. అవి డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటాయి అంటూ సందేశాన్ని ఇచ్చాడు. మానవత్వంతో సచిన్ చేసిన పనిని నెటిజన్లు అభినందించారు.

Comments

comments