Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

థ్యాంక్స్ కెటిఆర్: సచిన్

Sachin Tendulkar Accepted KTR Green Change
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హరితహారం ఛాలెంజ్‌ ను స్వీకరించారు. మంత్రి కెటిఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సచిన్ తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్‌, హరితహారంకు తనను ఎంపిక చేసినందుకు మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. అందరూ గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. భూతల్లిని పచ్చగా ఉంచే ” కీ ” మన చేతుల్లోనే ఉందని సచిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సచిన్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడం పట్ల కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘థ్యాంక్స్ మాస్టర్… మీరు ఈ ఛాలెంజ్‌కు మరో ఐదుగురిని ఎంపిక చేయాలని కోరుకుంటున్నాను..’’ అని ట్వీట్ చేశారు.

Comments

comments