Search
Sunday 23 September 2018
  • :
  • :

సినిమాల్లోకి సచిన్ కూతురు సారా?

SAARA

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాపై మళ్లీ పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆమె సినిమారంగంలోకి రానుందనే పుకార్లు హల్‌చల్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు ఆమె బాలీవుడ్ నటడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దిగిన ఫొటే కారణం. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సారా సినిమాలోకి వస్తుందన్న పుకార్లు గతంలో కూడా వచ్చాయి. అయితే పుకార్లు తీవ్రం కావడంతో స్వయంగా సచినే స్పందించారు. తన కూతురు సారా సినిమాల్లోకి రావడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆమె చదువుకుంటుందని, సినిమాలోకి వస్తుందన్న పుకార్లు పూర్తి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు సారా వయస్సు 19 ఏళ్లు. సచిన్ బయోపిక్‌లో కూడా సారా నిజజీవిత పాత్రలో కనిపించనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పుకార్లు నిజమో కాదో కాలమే నిర్ణయించాలి.

Comments

comments