Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మంచి పని చేసి… విమర్శలు ఎదుర్కొన్న సచిన్

bird-life

న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ మానవత్వంతో చేసిన ఓ మంచి పనికి ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొందరేమో విమర్శలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందో చూద్దాం. సచిన్ ఇంటి బాల్కనీలో ఓ పక్షి వచ్చి వాలింది. దప్పికతో, గాయాలతో ఎగరలేని స్థితిలో కనిపించింది. దాని పరిస్థితిని గమనించిన టెండూల్కర్ పక్షికి ఆహారాన్ని, నీరు అందించాడు. అయిన పక్షి కదలలేక పోయింది. చివరకు ఓ ఎన్టివొకు సచిన్ సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన ఎన్టివొ సిబ్బంది ఆయన నివసానికి వచ్చి పక్షికి వైద్యం అందించారు. 3రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న పక్షిని స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరింది. అయితే ఈ వీడియోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మానవతా దృక్పథం తో సచిన్ చేసిన ఈ మంచి పనికి పలువురు అభినందించారు. కానీ కొందరు మాత్రం అన్ని జీవులపై కూడా ఇలాంటి ప్రేమనే చూపించాలంటున్నారు. మాంసాహారం మానేసి, శాకాహారమే తినాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. సచిన్ నిర్వహిస్తున్న హోటళ్లలో కూడా శాఖాహారాన్నే సప్లై చేయాలంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

Comments

comments