Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

హైదరాబాదీ బిర్యానీ చాలా ఇష్టం

sachinహైదరాబాద్: హైదరాబాదీ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన బయోపిక్ సచిన్ ఏ బ్రిలియన్ డ్రీమ్స్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మాస్టర్ బ్యాట్స్‌మన్ ఓ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చాడు. ఇందులో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. అంతేగాక, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని కూడా పంచుకున్నాడు. తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, ఇక్కడకు వచ్చిన ప్రతిసారి దీన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాదీ బిర్యానీ అందుబాటులో ఉంటే సంకోచం లేకుండా అరగిస్తానని వివరించాడు. అంతేగాక, హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నాడు. ఇక్కడి అభిమానులు అంటే తన చాలా గౌరవం అన్నాడు. క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడంలో హైదరాబాదీ అభిమానులకు ఎవరు సాటిరారన్నాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో హైదరాబాద్‌తో మరచిపోలేని తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. తన బయోపిక్ గురించి వివరిస్తూ చిత్రానికి ఏఆర్ రహ్మాన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నాడు. తన చిరకాల మిత్రుడైన రహ్మాన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిచాడన్నాడు. కాగా, తనపై బయోపిక్ తీస్తమని అడిగినప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యానన్నాడు. మొదట్లో చేయాలా? వద్దా? అని ఆలోచించానన్నాడు. చాలా ఆలోచించిన తర్వాతే దీనికి ఒప్పుకున్నానని వివరించాడు. మొదట్లో కెమెరా ముందు కొంత ఇబ్బంది పడ్డానని, కొద్ది రోజుల్లోనే అలవాటు కావడంతో కెమెరా అంటే భయం పోయిందన్నాడు. ఈ చిత్రంలో తన జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించానని, చిత్రంను చూసిన అభిమానులు పూర్తి సంతృప్తిని పొందుతారనే నమ్మకాన్ని సచిన్ వ్యక్తం చేశాడు. కాగా, మిగిలిన బయోపిక్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదన్నాడు. ఇప్పటి వరకు తన జీవితంలో పెద్దగా దాచింది ఏమీ లేదన్నాడు. తన జీవితం ఏమిటో అభిమానులందరికి తెలుసన్నాడు. ఇప్పటి వరకు తాను ఏ విషయాన్ని కూడా దాచలేదన్నాడు. బయోపిక్‌లో కూడా తన జీవితం గురించి పూర్తిగా వివరించానన్నాడు. ఇది అభిమానులకు నచ్చుతుందనే నమ్మకం తనకుందని సచిన్ అన్నాడు.

Comments

comments