Search
Sunday 18 November 2018
  • :
  • :

పాఠశాల భవనం కోసం నిధులు విడుదల చేసిన సచిన్

Sachin Tendulkar sanctions 40 lakh for a school in Kupwara

శ్రీనగర్: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో స్కూల్ భవనం నిర్మాణం కోసం తన ఎంపి ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 40 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులను కుప్వారా జిల్లాలో పది తరగతి గదులు, నాలుగు లాబొరేటరీలు, ఆరు టాయిలెట్ల నిర్మాణంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్రార్థనా స్థలం కోసం వినియోగించనున్నారు. ఇంతకుముందు కూడా సచిన్ మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థల నిర్మాణం కోసం రూ. 7.4 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Comments

comments