Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సచిన్ అకాడమీ ప్రారంభం

Sachin Tendulkar started a new cricket academy in England

నార్త్‌వుడ్: మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌లో కొత్త క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. నార్త్‌వుడ్‌లోని మర్చంట్స్ టైలర్స్ స్కూల్‌లో మిడిలెక్స్ క్రికెట్‌తో కలిసి సచిన్ ఈ అకాడమీని ఏర్పాటు చేశాడు. సోమవారం దీన్ని సచిన్ ప్రారంభించాడు. ఈ అకాడమీకి టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీ (టిఎమ్‌జిఎ) అని పేరు పెట్టారు. సచిన్ స్వయంగా అకాడమీని ప్రారంభించాడు. గురువారం వరకు సచిన్ అకాడమీలోనే ఉంటాడు. ఈ సందర్భంగా 9 నుంచి 14 ఏళ్ల లోపు క్రికెటర్లకు సచిన్ క్రికెట్ పాఠాలు చెప్పనున్నాడు. సచిన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని మంచి క్రికెటర్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ అకాడమీని ప్రారంభించినట్టు సచిన్ వివరించాడు. యువతి, యువకులకు క్రికెట్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నాడు. త్వరలోనే లండన్, ముంబయి వంటి నగరాల్లో ఈ అకాడమీని ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నాడు. కాగా, అకాడమీని ప్రారంభించిన అనంతరం సచిన్ పిల్లలతో స్వయంగా భేటి అయ్యాడు. ఈ సందర్భంగా వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పాడు. ఈ అకాడమీలో అత్యంత అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నాడు. రానున్న రోజుల్లో అకాడమీ ద్వారా పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారనే ధీమాను సచిన్ వ్యక్తం చేశాడు.

Comments

comments