Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్

Sachin-Tendulkar

ముంబయి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు లిటిల్ మాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్‌ శుభ్రం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేమందరం ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నాం.  మీరు కూడా మీ మిత్రులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని’  అభిమానులను సచిన్ కోరారు.  కాగా, ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రధాని మోడీ ఆహ్వానిస్తూ లేఖలు రాసిన విషయం తెలిసిందే.

Comments

comments