Search
Sunday 18 November 2018
  • :
  • :

సాదా బైనామా దరఖాస్తులు 10 లక్షలు దాటాయి

sadaమన తెలంగాణ/హైదరాబాద్ : సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వానికి పది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. చివరి గడువు బుధవారంతో ముగిసినట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. బుధవారం సాయంత్రం వరకు 10,96,344 దరఖాస్తులు అందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నెల రోజుల వ్యవధిలో దరఖాస్తులు పరిష్కరించి, లబ్ధిదారులకు పత్రాలను అందచేయాలని జిల్లా కలెక్టర్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.రేమాండ్ పీటర్ ఆదేశించారు. వరంగల్ జిల్లా నుంచి 2,97,699 దరఖాస్తులు రాగా హైదరాబాద్ జిల్లా నుంచి తక్కువ సంఖ్యలో 12 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తొలిసారి విధించిన గడువు ప్రకారం ఈనెల 15వ తేదీ వరకు 6.21 లక్షల దరఖాస్తులు అందాయి. పొడిగించిన గడువుతో ఆ సంఖ్య 10,96,344 దరఖాస్తులు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కావడం ప్రథమమని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారీగా అందిన దరఖాస్తుల సంఖ్య ఇలా ఉంది.

Comments

comments