Home ఖమ్మం సడక్ బంద్ సక్సెస్

సడక్ బంద్ సక్సెస్

Sadak Bandh Success

గంట పాటు స్తంభించిన ట్రాఫిక్
పలు చోట్ల నేతల అరెస్టు
వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రహదారి దిగ్బంధనం
రైతుబంధు వర్తింప జేయాలని డిమాండ్

రైతుల సమస్యలను పరిష్కరించాలని వామపక్ష, రైతు సంఘాలు, టిజేఏస్ ఆధ్వర్యంలో గురువారం సడక్ బంద్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పలు కూడళ్లు, మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించారు. గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పిండిప్రోలు, ఖమ్మం రాపర్తినగర్, కొణిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు, ఇల్లందు, చండ్రుగొండ, కొత్తగూడెం, భద్రాచలం కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో సహా పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖమ్మంలో వామపక్ష నేతలు బాగం హేమంతరావు, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘాల నేతలను, టిజేఏస్ నాయకులు డాక్టర్ శీలం పాపారావులను అరెస్టు చేశారు. భద్రాచలంలో శాసన సభ్యులు సున్నం రాజయ్య, సిపిఐ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ తదితరులు ఆందోళనలకు నాయకత్వం వహించారు. కొణిజర్లలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్ నేతృత్వం వహించారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులు, పోడు సాగుదారులకు రైతుబంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ/వైరా : అఖిలపక్షం పార్టీలైన సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన సడక్‌బంద్ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన రోడ్ల దిగ్భంధం కార్యక్రమానికి వామపక్షపార్టీల నాయకులు, రైతుసంఘం నాయకులు భారీగా తరలివచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డు నందు జరిగిన రహదారులు ది గ్భంధం కార్యక్రమంలో ఏఐకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందడపు నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దొండపాటి రమేష్, జిల్లా సమితి సభ్యు లు బెజవాడ రవిబాబు, తోట రామాంజనేయులు, గోపాలరావు, ఆనందరావు, మందడపు రాణి, పెరుమాళ్ల ప్రకాష్‌రావు నేతల ఆధ్వర్యంలో సడక్‌బంద్ విజయవంతమైంది. రహదారు లు దిగ్భంధం చేపట్టడంతో కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు బొంతు రాంబాబు, కంకణాల అర్జున్‌రావు, సుందర రామయ్య తదితరులు పాల్గొన్నారు.