ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజి నిర్మాణం ఖా నాపూర్ ప్రాంతానికా? లేక నిర్మల్ ప్రాంతానికా? తెలియని సం దిగ్దంలో ఖానాపూర్, కడెం రైతులు ఉన్నారని వారి అనుమానాల ను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని, యాసంగి పంటలో సద ర్మాట్ చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్రావు అన్నారు. బుధ వారం ఖానాపూర్‌లో ఆయన ఆధ్వర్యంలోనే మహాధర్నా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ధర్నాకు ముందు స్థానిక విశ్రాంతి భవనం నుంచి వందలాది మంది రైతులతో ర్యాలీగా తరలివచ్చారు.
పాత బస్‌స్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రాహానికి, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రాహానికి, మాజీ ఎంపిపి జగన్నాథ్ విగ్రహా నికి పూలమాలలు వేసి ఇక్కడే ఆందోళన కార్యక్రమం నిర్వహిం చారు. నాలుగు గంటల పాటు ప్రాధాన రహదారిపై రాస్తారోకో ని ర్వహించడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. ఈ సందర్భం గా రవీందర్రావు మాట్లాడుతూ సదర్మాట్ బ్యారేజి నిర్మాణం కో సం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సద ర్మాట్ బ్యారేజి నిర్మాణానికి స్వీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ యేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా సదర్మాట్ను సందర్శించి దాని విషిస్టతను తెలుసుకొని బ్యారేజి నిర్మాణానికి పూనుకున్నరన్నారు.
తిరిగి రెండో సారి వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి సదర్మాట్ వద్దనే బ్యారేజి నిర్మాణానికి సర్వేలు చే యించి. రూ. 386 కోట్లతో నిర్మాణానికి జిఒ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఖానాపూర్ పర్యటనకు వ చ్చినపుడు బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని వైఎస్ మ రణానంతరం ఆంధ్ర పాలకుల నిర్లక్షదోరనితో బ్యారేజి నిర్మాణం ఆగిపోయిందన్నారు. 11న భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీ శ్‌రావు, ఖానాపూర్‌కు వచ్చి బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చే యడం హర్షణీయమన్నారు. యాసంగి పంటలో సదర్మాట్ ఆ యకట్టకు కేవలం ఐదు వేల ఎకరాలకే సాగు నీరు విడుదల చేస్తా మని మంత్రి ప్రకటించడం దురదృష్టకరమన్నారు.
సదర్మాట్ బ్యారేజిని సదర్మాట్ వద్ద కాకుండా ఎగువ ప్రాం తమైన ఏడు కిలోమీటరలు పైన పోన్కల్ వద్ద బ్యారేజి నిర్మిస్తు న్నారని బ్యారేజి నిర్మాణంపై ఈ ప్రాంత రైతులకు చెందాల్సిన సదర్మాట్ హక్కులపై అనుమానాలు ఉన్నాయని అనుమానాల ను నివృత్తి చేయకపో వడంతో రైతుల్లో ఆందోళనలు నేలకొంద న్నారు. సదర్మాట్ ఆ యకట్టు కింద ఖానాపూర్,కడెం మండలా ల్లో 12వేల ఎకరాలు, బాదన్కూడ్తి కెనాల్ కింద రెండువేల ఎక రాలు సాగుఅవుతుందని ప్రస్తుతం శ్రీరాంసగర్ ప్రాజెక్టులో 72 టిఎంసిల నీరు ఉంనందున సదర్మట్ చివరి ఆయ కట్టవరకు సా గునీరు అందించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు అవగాహన లేదని మండిపండ్డారు.
నెలరోజుల లోపు సదర్మాట్ రైతంగానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామ ని ఆయన హెచ్చరించారు. సదర్మాట్ చివరి ఆయకట్టవరకు రబి పంటకు నీరం దించకుంటే దీక్ష చేపడతానని కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియో జకవర్గ ఇన్చార్జి హరినాయక్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదని రాస్తారోకో చేపట్టారు. నాలుగు గంటలపాటు రాస్తారోకో జరుగ గా సంఘటన స్థలానికి తహసీల్దార్ నరేందర్ వచ్చి ఆందోళన విరమించాలని నచ్చచెప్పారు. సదర్మాట్ బ్యారేజి నిర్మాణంపై నెలకొన్న అనుమానా లపై నివృత్తి చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయినప్పటికి రాస్తారోకో కొనసాగించి నప్పటికిని సిఐ నరేష్‌కు మార్ అక్కడికి చేరుకోని ధర్నాను వి చ్ఛినం చేశారు.
పోలీసులకు నాయకులకు మద్య తీవ్ర వాగ్వివాదలు జరిగి ఉద్ధృక్త పరిస్థిలులకు దారి తీశాయి. రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బలవంతంగా ఈడ్చుకెల్లి పోలీసు స్టేషన్‌కు తర లించారు. పోలీసులు బలవంతంగా ఈడ్చుకెల్లడంతో మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ సాయి లక్ష్మణ్‌రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎం.ఎ వాకిల్ ఆస్వస్థతకు గురైయ్యారు. వీరిని ఖానాపూర్ ప్ర భుత్వ అసుపత్రిలో చేర్పించి చికిత్స జరిపారు. ఆరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ససొంతపూచికత్తుతో వి డుదల చేశారు.
నేడు ఖానాపూర్ బంద్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాను పోలీసు లు విచ్చినం చేయడం నాయకులను ఆరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బంద్‌కు పిలుపిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సి సెల్ రాష్ట్ర ఉపాధ్యయులు భారత్ చౌహన్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మాజీ ఎంపిపి శంకర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కే.గంగరావు, మాజీ అధ్యక్షుడు సురేష్, కోఆప్షన్ స భ్యులు మాజిద్, నాయకులు దయానంద్, సాగర్, పెద్దులు, బిసి రా మేష్, సాయి, సతిష్రెడ్డి, మున్నవార్అలీ, ఖానా పూర్, కడెం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.