Home నిర్మల్ ప్రపంచ పహిల్వాన్

ప్రపంచ పహిల్వాన్

ఖండాంతర పోటీల్లో చాంపియన్‌గా  నిలుస్తున్న బాసర నివాసి
స్పాన్సర్‌ల కరువుతో అంతర్జాతీయ  పోటీలకు ఆటంకాలు
ప్రతిభకు అడ్డురాని పేదరికం
ఏసియన్ గేమ్స్‌లో బంగారు పతకమే లక్షం

Boxing

బాసర: చైనా సంప్రదాయ ఆటైన ఊషు మార్షల్ ఆర్ట్ బాక్సింగ్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని క్యాంస పతకం సాధించిన బాసర మండలం సాలపూర్ నివాసి సద్ధాం హుస్సేన్ ప్రపంచ పహిల్‌వాన్‌గా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. బాసర మండలంలోని కుగ్రామమైన సాలపూర్ నుండి తన పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ఖండాంతర పోటీల్లో పాల్గొని చాంపియన్‌గా నిలుస్తూ జిల్లా యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుంట భూమి లేని నిరుపేద కుటుంబంలో జన్మించిన సద్ధాం ప్రతికూల పరిస్థితిల్లో ఎదురు నిలిచి తను సాధించిన విజయం అసమాన్యం. అటు గ్రామీ ణులకు పరిచయం లేని ఆటలో ప్రతిభ కనబరుస్తున్నాడు.

పట్టుదలే ప్రతిభకు నిదర్శనం

బాసర మండలం సాలపూర్ గ్రామానికి చెందిన సద్ధాం హుస్సేన్ నిరుపేద కుటుంబం తండ్రి పాషమియ్యా, తల్లి రోషన్‌బి, మున్నాబీలకు చెందిన నాల్గవ సంతానం సద్ధాం తండ్రి పాషామియ్యా గతంలో గ్రామంలోని పలువురి పట్ల ప్రేమాభిమానంతో ఉండేవారు. తండ్రి పాషామియ్యా వృత్తిరిత్యా కట్టెల వ్యాపారం, చికెన్ సెంటర్, చాయా కొట్టు దుకాణం నడిపేవాడు. దురదృష్ట వశాత్తుగా 5 సంవత్సరాల క్రితం తండ్రి గుండె పోటుతో మరణించాడు. తల్లి రోషన్‌బి, మున్నాబిలు కూలీ నాలి పనులు చేస్తూ పేదరికాన్ని జయించి సద్ధాంకు ఉన్నత చదువులు చదివించారు. సద్ధాం పాఠశాల విద్య కౌటాలో పూర్తి చేసి ఆష్టా ప్రభుత్వ పాఠశాలలో మ్యాట్రిక్ పూర్తి చేసుకుని జాగృతి ప్రైవేటు కళాశాలలో ఇంటర్ వరకు చదివి, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అంబేద్కర్ సార్వత్రిక దూర విద్యావిధానం ద్వారా డిగ్రీ పూర్తి చేసి రక్షణ దళంలో పని చేసేందుకు ఆసక్తితో నిజమాబాద్ పట్టనంలో ఓ శిక్షణ సంస్థలోకి చేరి శారిరకంగా పటుత్వం సాధించి శిక్షణ పొందాడు. ఆ క్రమంలోనే అక్కడ శిక్షణ ఇచ్చిన మహ్మద్ ఉమర్ ప్రోత్సాహంతో ఊషులో ప్రథమ శిక్షణ పొంది మెలుకువలు నేర్చుకున్నాడు.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి సాధించిన పతకాలు

జిల్లా స్థాయిలోని నిజమాబాద్ నుండి తమ కరాటే, బాక్సింగ్ చైనా సంప్రదాయ ఆటలో తమ నైపుణ్యాన్ని సాధించి జైత్రయాత్ర ప్రారంభిం చాడు. అనంతరం వివిధ పోటీల్లో విజేత గా నిలిచి 2012లో కరీంనగర్ వేదికగా 8వ సీనియర్ అంతర్ జిల్లా ఊషు పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. అదే సంవత్సరం జమ్మూ కాశ్మిర్లో జరిగిన పోటీల్లో 8వ స్థానంలో నిలిచి, ఆ తరువాత 2013లో హరాయాణలోని రోహతక్ లో మొదటి ఫెడరేషన్ కప్‌లో క్యాంస పతకం, నిజమాబాద్‌లో బంగారు పతకం, 2014లో ఢిల్లీలో నిర్వహించిన 2వ ఫెడరేషన్ కప్‌లో రజత పతకం సాధించి 21వ సీనియర్ జాతీయ స్థాయి ఊషు పోటీల్లో పశ్చిం బెంగాల్‌లోని కలకత్తాలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిద్యం వహించాడు. అనంతరం హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఆరవ స్థానం, 2015 ఢిల్లీలో నిర్వహించిన ఓలంపిక్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. అనంతరం తమ క్రీడా పోటీల్లో 2013లో కేంద్ర రిజర్వ్ బలగాలలో (సిఆర్‌పిఎఫ్) జవానుగా ఢిల్లీలో వి ధులు నిర్వహిస్తున్నారు. సద్ధాం సైతం అతని ప్రతిభను గుర్తించి ప్రోత్స హించడంతో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన పోటీల్లో మొద టి స్థానంలో నిలిచి అంతర్జాతీయ ఊషు పోటీల్లో అర్హత సాధించాడు.

ఖండాంతరంలో జయకేతనం

గత ఏప్రిల్ నెలలో 21, 23 తేదిల్లో యూరోప్ ఖండంలోని పశ్చిమాసియా దేశమైన ఆర్మేనియా యోరనాన్‌లో మొదటి అంతర్జాతీయ ఊషు పోటీల్లో 60 కిలోల విభాగంలో పోటి పడిన ఆయన మొదటి ఆటలో అభ్యర్థి అనారోగ్యంతో వాకోవర్ లభించింది. రెండో ఆటలో కజాకిస్తాన్ ప్రత్యర్థిపై వరుస రౌండ్లలో నాకౌట్‌గా నిలిచి విజయం సాధించాడు. అనంతరం ఇరాక్‌కు చెందిన ప్రత్యర్థిపై ఓడి క్యాంస పతకం సాధించాడు. భారత ఊషు కోచ్ రాజ్‌వీర్ సింగ్, సిఆర్‌పిఎఫ్ అధికారులు గ్రామస్తుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించడం జరిగిందన్నారు.

స్పాన్సర్ల కరువుతో అంతర్జాతీయ పోటీలకు దూరం

ముందే పేదరిక కుటుంబం. ఇంటి వద్ద గుంట భూమి కూడా లేదు. సైన్యంలో ఉన్నప్పటికీ జీవనం గడపడానికి జీతం సరిపోదు. ఇటీవల ఊషు పోటీల్లో భాగంగా ఆర్మేనియాలో జరిగిన పోటీల్లో ఆర్థిక స్థోమత లేక గ్రామ అంబేద్కర్ యూత్, ముథోల్ ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి, తన ఆత్మీ య మిత్రుడు చంద్రకాంత్ డబ్బులు పోగు చేసి సద్ధాంకు ఆత్మధైర్యాన్ని పెంపొందించి మనోదైర్యం కోల్పోకుండా తమ వంతు ఆర్థిక సాయం చే యడంతో ఆర్మేనియాలో క్యాంస సాధించానని అన్నారు. జూన్‌లో రోమే నియా దేశంలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి స్పాన్సర్ల అవసరం ఉంటుం దని ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎవరైనా సహాయం చేస్తేనే పాల్గొంటానని లేకుంటే పోటీ నుంచి నిష్క్రమించుకుంటానని సద్ధాం పేర్కొన్నాడు.

బంగారు పతకం సాధించడమే లక్ష్యం

ఏసియన్ గేమ్స్, ఓలంపిక్స్‌లో మన దేశం తరుపున పాల్గొని బంగారు పతకం సాధించడమే తన ఏకైక లక్షమని సద్ధాం హుస్సేన్ మన తెలంగాణతో సద్ధాం హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఆర్మేనియాలో జరిగిన ఊషు పోటీల్లో క్యాంస పతకం సాధించడంతో బాసర రైల్వే స్టేషన్ నుండి హుస్సేన్ దర్గా వరకు భారీగా ర్యాలీ నిర్వహించిన బాసర టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నూకం రామారావు ఆద్వర్యంలో, గ్రామ సర్పంచ్, వివిధ సంఘాల నాయకులు, నిర్మల్ జిల్లా ఎస్‌పి విష్ణుయస్ వారియర్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌ఱెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠ్ఠల్‌రెడ్డిలు సన్మానించి తగిన పారితోషకం అందజేశారు.