Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మహిళపై సాధువు అత్యాచారం

RAPED

థానే : గత జన్మలో నా భార్యవంటూ ఓ సాధువు ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. థానేకు చెందిన సాయిలాల్ జేథియా అనే వ్యక్తి తాను దేవుడినంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. మంత్రాలతో రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బును దోచుకున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ సాయిలాల్ వద్దకు సాయం కోసం వచ్చింది. గత జన్మలో నువ్వు నా భార్యవంటూ ఆ మహిళను నమ్మించాడు. సాయిలాల్‌ను గుడ్డిగా నమ్మిన ఆమె అతడితో పలు ప్రాంతాలకు తిరిగింది. ఈ క్రమంలో సాయిలాల్ ఆమెను అసోం తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయిలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Sadhu Raped  Woman

Comments

comments