Search
Saturday 22 September 2018
  • :
  • :

తెలంగాణలో సేఫ్టీ అకాడమీ : నాయిని

NAINI

హైదరాబాద్ : బెంగళూరు తరహాలో తెలంగాణలో సేఫ్టీ అకాడమీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అనువైన స్థలం ఎంపిక చేసి అత్యున్నత ప్రమాణాలతో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు సంపూర్ణ అవగాహన కల్పించే అవకాశం ఈ అకాడమీ ఏర్పాటు వల్ల కలుగుతుందన్నారు. ఆయా పరిశ్రమల్లో పని చేసే ఒప్పంద కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు 12 వేల నుంచి 18 వేల రూపాయల వేతనం చెల్లించేలా మేడే రోజున అధికారిక ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్ ఫ్యాప్సీ భవన్‌లో జాతీయ భ ద్రతా సమాఖ్య, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ భద్రత, ఆరోగ్య, పరిరక్షణ దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

Comments

comments