Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎంజిబిఎస్ వద్ద ధనుస్సు ఆకారంలో బ్రిడ్జి

Sagittarius shaped bridge at MGBS

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న బల్దియా

మన తెలంగాణ/సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్ స్టేషన్(ఎంజిబిఎస్) రంగ్‌మహాల్ జంక్షన్‌ల మధ్య మూసీ నదిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని గత 10 సంవత్సరాల నుంచి చేసిన ప్రతిపాదనలు ఎక్కడివేసిన గొంగడి అక్కడే అన్నచందాన ఉన్నాయి. తాజాగా ప్రయాణికుల సౌకర్యం కోసం బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఇటీవల ప్రభుత్వం జిహెచ్‌ఎంసిని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో బల్దియా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎంజిబిఎస్ నుంచి బస్సులు బయటకు పాత బస్టాండ్ వైపు నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వెళ్లుతున్నాయి. పాత బస్టాడ్ దగ్గర జంక్షన్‌లో మాటి మాటికి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ క్రమంలో ఎంజిబిఎస్ రంగ్‌మహాల్ జంక్షన్‌ల మధ్య ఆధునాతన వంతెన నిర్మించాలని నిర్ణయించారు. బౌస్ట్రీంగ్(ధనస్సు) ఆకారంలో బ్రిడ్జి డిజైన్లను రూపొందిస్తున్నారు. బ్రిడ్జిపై ధనస్సు ఆకారంలో డిజైన్ వస్తుంది. ధనస్సు ఆకారంలో రూపొందే డిజైన్‌లో కేబుల్స్‌ను అమరుస్తారు. సుమారు రూ.15 కోట్ల అంచన వ్యయంతో 80 మీటర్ల పొడవు, నాలుగు లైన్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఎంజిబిఎస్ నుంచి బస్సులు నేరుగా గోల్నాక వైపు వెళ్లేందుకు వీలవుతుంది. అంతేకాకుండా కోఠి, పుత్లీబౌలి వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాగునీటి శాఖ అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు వచ్చేలోపు కన్సల్టెన్సీ ద్వారా డిజైన్లు రూపొందించి, సిద్దంగా ఉండాలని నిర్ణయించారు. అంచన వ్యయం, డిజైన్ల తయారీ, నిర్మాణా సమయం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

ఆర్‌టిసి, హెచ్‌ఎంఆర్‌ల భారం బల్దియాపై..
ఎంజిబిఎస్ రంగ్‌మహాళ్‌ల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని ముందుగా ఆర్‌టిసి, హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థలు నిర్మించాలని నిర్ణయించారు. ఎం.జి.బిఎస్‌కు చెందిన స్థలాన్ని మెట్రోరైలుకు వినియోగించుకోవడంతో ప్రతిఫలంగా ఆర్‌టిసికి బ్రిడ్జి నిర్మించి ఇచ్చేందుకు మొదట్లో అంగీకారం కుదిరింది. అయితే నిధులను మాత్రం ఇరు సంస్థలు 50 శాతం చొప్పున భారించాలని భావించారు. ఆర్‌టిసి తీవ్రమైన నష్టాల్లో ఉండటంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణా బాధ్యతలను జిహెచ్‌ఎంసికి అప్పగించారు. ఆర్‌టిసి, హెచ్‌ఎంఆర్‌ల ఆర్థిక భారం బల్దియాపై పడింది.

Comments

comments