Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాబా మహిమాన్వితం మానవ మనుగడకు సోపానం: స్పీకర్ మధుసూదనాచారి

Sai-baba1

బీబీనగర్: స్వార్థమే పరమార్థమై దుర్మార్గం పరాకాష్టకు చేరుకుంటున్న ఈసమాజంలో శిరిడి సాయి మహిమానిత్వం, శక్తి మానవ మనుగడకు సోపానంగా నిలుస్తుందని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని కొండమడుగు శివా రులో సాయి సేవాశ్రమం ఆధ్వర్యంలో నిర్మించిన 100 అడుగుల సాయిబాబ విగ్రహ ఆవిష్కరణ ఆదివారం జరిగింది.

ఈ సందర్బంగా బాబాను దర్శించుకున్న స్పీకర్ మాట్లాడుతూ బాబా మానవ రూపంలో తనశక్తిని, మానవత్వాన్ని చాటుతున్నాడని అనడానికి బాబా వారి భారీ విగ్రహాల ఏర్పాటే నిదర్శనమని అన్నారు. అధ్యాత్మికతను చాటి చెప్పే విధంగా సేవాశ్రమం ఆద్వర్యంలో నెలకొల్పిన భారీ విగ్రహం అద్బుతమని కొనియాడారు. శాంతి సమాజాన్ని నెలకొ ల్పేందుకు ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకొని సమాజానికి మంచిని అందించాలని అన్నారు. 100 అడుగుల ఎత్తు గల బాబా విగ్రహాన్ని చూడటం ఇదే మొదటిసారి అని ఇటువంటి పవిత్రకార్యాలు నిర్వహిస్తున్న సేవాశ్రమం గురుదేవులు అమ్ముల సాంబశివరావును అభినందించారు.

బాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే:

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సేవాశ్రమం నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. నూతన సంవత్సరం కావడం, బాబా విగ్రహ ఆవిష్కరణ జరిగిన సందర్బంగా సేవాశ్రమం వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ రాష్ట్రాలు, హైదరాబాదు నుంచి సాయి సేవకులు వేల సంఖ్యలో ఆశ్రమానికి తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల భక్తులు బాబాను దర్శించుకునేందుకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా సాయి స్మరణలతో విరాజిల్లింది. ఆశ్రమానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం హైదరాబాదు నుంచి నేరుగా ఆశ్రమం వద్దకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. విగ్ర హావిష్కరణ సందర్బంగా నిర్వహించిన సాయి వ్రతాలలో సుమారు 2వేలకు పైగా భక్తులు పాల్గొ ని పూజలు నిర్వహించారు. వీరందరికి గురుదేవులు సాంబశివరావు బాబా ఉపదేశాన్ని తెలియ జేశారు. బాబాను దర్శించుకున్న భక్తుల కోసం సుమారు 5వేల మందికి భోజన, ప్రసా దాలను ఏర్పాటు చేశారు. రాత్రి వరకు భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సందడితో కిక్కిరిసిపోయింది.

Comments

comments