Search
Sunday 18 November 2018
  • :
  • :

రెగ్యులర్ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్ చిత్రం

Sai-Dharam-Tej

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇప్పటివరకు ఒక యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది.
సాయిధరమ్ తేజ్‌కు ఇది ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది. సాయిధరమ్‌తేజ్, వినాయక్ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది”అని అన్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్ రామకృష్ణ, నాజర్, జె.పి., రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, ఆకుల శివ, ఆశిష్ విద్యార్థి, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం, తాగుబోతు రమేష్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలుః శివ ఆకుల, సినిమాటోగ్రఫీః విశ్వేశ్వర్, ఎడిటింగ్‌ః గౌతంరాజు, ఫైట్స్‌ః వెంకట్.

Comments

comments