Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్…

Sai Pallavi Birthday Special Poster from Padi Padi Leche Manasu

హైదరాబాద్: ‘ఫిదా’ మూవీలో భానుమతిగా తెలుగు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టిన భామ సాయి పల్లవి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం పడి పడి లేచె మనసు నుంచి సాయి పల్లవి స్టిల్స్‌ను విడుదల చేసి ఆమెకు స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా సాయి పల్లవి రెండు స్టిల్స్‌ను విడుదల చేయగా రెండింటిలోనూ ఆమె తన మార్క్ క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్స్‌ను చూసి ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Sai Pallavi Birthday Special Poster from Padi Padi Leche Manasu

ఈ చిత్రం కూడా సాయి పల్లవికి మరో హిట్‌ను అందించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ వంటి ప్రేమ కథ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు హను రాఘవపూడి. ఆయన డైరెక్షన్‌లో శర్వనంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంటటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు అందిస్తున్నాడు.

Comments

comments